Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raakadane Railu Bandi

రాకడనే రైలు బండి

Raakadane Railu Bandi

Lyricist: Peter Singh
Verse
రాకడనే రైలు బండి వస్తున్నది
రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది‖ 2x ‖
పరిశుద్ధులకందులో చోటున్నది‖ 2x ‖
మంచి చోటున్నది – భలే చోటున్నది
చక్కని సీటున్నది‖ రాకడనే ‖
Verse
సత్యమనే చక్రములు దానికున్నవి
శాంతి అనెడి పైకప్పు దానికున్నది‖ 2x ‖
పాపములను క్షమియించే బ్రేకులున్నవి – బండికి బ్రేకులున్నవి
జీవమునకు మార్గమని కూయుచున్నది – కూత కూయుచున్నది‖ రాకడనే ‖
Verse
ప్రతి దినము బైబిలును పఠియించుము
ప్రార్దననెడి విజ్ఞాపన వివరించుము – ప్రభుకి వివరించుము
ఎదురు వీచే గాలులనెడి వ్యాధి బాధలన్
సాతాను చిక్కులను యేసు రక్తమందు కడిగి
జయము పొందుము – పవిత్రుడవు కమ్ము‖ రాకడనే ‖
Verse
తండ్రి కుమారాత్మలనే రైలు బండిది
ఇంజను డ్రైవరు పేరు యెహోవాండి‖ 2x ‖
పరిశుద్ధ ఆత్మ అనెడి గార్డు ఉన్నాడు – బండికి గార్డు ఉన్నాడు
సిలువ జెండా ఎత్తి చూపి బండి నిలుపుము – నీవు ప్రవేశించుము‖ రాకడనే ‖
Verse
రక్షణనే టిక్కెట్టు దానికున్నది‖ 2x ‖
మారు మారుమనస్సు పొంది మీరు
ముందుకు రండి – టిక్కెట్టు కొనండి‖ 2x రాకడనే ‖
Verse
పాపులున్న స్టేషనులో బండి ఆగదు‖ 2x ‖
పరిశుద్ధుల స్టేషనులో
బండి ఆగును – రైలు బండి ఆగును‖ 2x రాకడనే ‖

Related Tags

Second ComingGospel