Verse 1
రాలి పోదువో నీవు కూలిపోదువో
తెలియదురా నీకు ఏగడియో
పువ్వు రాలు విదముగారాలి పోదువో
అయ్యో మానవా మాయరా, మాయరా ఇది మాయరా "రాలిపో"‖ రాలిపో ‖
Verse
రేపు నీది కాదని తెలుసుకో - మునగకురా నీవు బ్రతుకవురా
ఒట్టిదిరా నీవు మట్టివిరా‖ 2x ‖
అయ్యో మానవా మాయరా ఇది మాయరా "రాలిపో"‖ రాలిపో ‖
Verse
కోరకురా నీవు కోర్కెలనూ - ఉండవురా నీవు మన్నేరా
కుండవురా నీవు పగిలెదవు‖ 2x ‖
అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా "రాలిపో"‖ రాలిపో ‖
Verse
నీవు పోయినపుడు ఏడ్చెదరేగాని - ఎవ్వరు రారయ్య నీ వెంట
ఎందరు వున్న ఒక్కడివే‖ 2x ‖
అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా "రాలిపో"‖ రాలిపో ‖
Verse
భార్యభిడ్డలు మాయరా - లోక నివాసులు మాయరా
మర్చిపోదురు నిన్ను ఒక దినము‖ 2x ‖
అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా "రాలిపో"‖ రాలిపో ‖