Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raaraaju Janminche Ilalona

రారాజు జన్మించే ఇలలోన

Raaraaju Janminche Ilalona

Verse
రారాజు జన్మించే ఇలలోన
యేసు రారాజు జన్మించే ఇలలోన‖ 2x ‖
ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతా
రండీ మనమంతా చాటి చెప్పుదాం‖ 2x ‖
ఓ సోదరా… ఓ సోదరీ…‖ 2x ‖
విష్ యు హాప్పీ క్రిస్మస్
అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్‖ 2x రారాజు ‖
Verse
అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరా
గ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా‖ 2x ‖
రాజులకు రారాజు పుడతాడంటూ
లేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ‖ 2x ‖
రాజాధి రాజుని చూడాలంటూ
(తూర్పు) జ్ఞానులంత ప్రభు యేసుని చూడవచ్చిరి –‖ 2x ఓ సోదరా ‖
Verse
అదిగదిగో తెల్లని ఆ వెలుగేమిటి సోదరా
(అని) గొల్లలంత భయపడుతూ వణికిపోతు ఉండగా‖ 2x ‖
రక్షకుడు మీకొరకు పుట్టాడంటూ
గొల్లలతో దేవదూత మాట్లాడేనూ‖ 2x ‖
ఈ లోక రక్షకుని చూడాలంటూ
(ఆ) గొల్లలంత ప్రభు యేసుని చూడవచ్చిరి –‖ 2x ఓ సోదరా ‖

Related Tags

ChristmasNativity