Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raaraaju Janminchinaadu

రారాజు జన్మించినాడు

Raaraaju Janminchinaadu

Verse
రారాజు జన్మించినాడు
ఈ అవనిలోన ఆ నాడు
నీ హృదిలో జన్మించుతాడు
స్థిరపరచుకో నీ మదిని నేడు‖ 2x ‖
యేసే దైవం ఈ సత్యాన్ని తెలుసుకో
యేసే సర్వం నిత్య రాజ్యమును చేరుకో‖ 2x రారాజు ‖
Verse
ఇదిగో నేను తలుపునొద్ద
నిలుచుండి తట్టుచున్నాను
ఎవడైనను నా స్వరమును విని
తీసినయెడల వచ్చెదను‖ 2x ‖
అని నిన్ను పిలుచుచున్నాడు
త్వరగా తలుపును తెరచి చూడు
చేజార్చకీ అవకాశము నేడు
రాదీ సమయము ఇంకేనాడు‖ 2x యేసే దైవం ‖
Verse
నేనే మార్గం నేనే సత్యం
నేనే జీవం అని అన్నాడు
నా ద్వారా తప్ప తండ్రి కడకు
చేరే మార్గం లేదన్నాడు‖ 2x ‖
ఈ మాటను పరికించి చూడు
యోచించుము నిజమేదో నేడు
త్వరలో ప్రభు రానైయున్నాడు
ఆ లోపే యేసయ్యను వేడు‖ 2x యేసే దైవం ‖

Related Tags

SalvationChristmasNativity