Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raaraaju Puttaadoi

రారాజు పుట్టాడోయ్

Raaraaju Puttaadoi

Verse
రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్
సూడంగ రారండోయ్ వేడంగ రారండోయ్‖ 2x ‖
ఈ లోకమునకు రక్షకుడిగ పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే…
ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే, హోయ్…‖ రారాజు ‖
Verse
వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగ మిన్నుల పండగ
సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
పశువుల పాకలోన ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై…‖ రారాజు ‖
Verse
మచ్చలేని ముత్యమల్లె పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లె కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా
సల్లంగా సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడెనంట
మరువని బంధమై…‖ రారాజు ‖

Related Tags

ChristmasCelebration