Verse
రారాజు వస్తున్నాడో
జనులారా.. రాజ్యం తెస్తున్నాడో
త్వరపడి వేగమే రండి
ప్రియులారా.. ప్రభుని చేరగ రండి
వస్తానన్న యేసు రాజు రాక మానునా
తెస్తానన్న బహుమానం తేక మానునా‖ 2x రారాజు ‖
Verse
పాపానికి జీతం రెండవ మరణం
అది అగ్ని గుండము అందులో వేదన‖ 2x ‖
మహిమకు యేసే మార్గము జీవము‖ 2x ‖
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము‖ 2x వస్తానన్న ‖
Verse
పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను
ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు‖ 2x ‖
యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం
యేసయ్య గాయాలు రక్షణకు మార్గం
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము‖ 2x వస్తానన్న ‖
Verse
కనురెప్ప పాటున కడబూర మ్రోగగా
పరమున ఉందురు నమ్మిన వారందరు‖ 2x ‖
నమ్మని వారందరు శ్రమల పాలవుతారు‖ 2x ‖
అందుకే నమ్ముకో యేసయ్యను
చేరుకో పరలోక రాజ్యంబును‖ 2x వస్తానన్న ‖