Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raarandi Yesu Paadhamula Chera Paapa Vimukthi Pondha

రారండి యేసు పాదముల చేర పాప విముక్తి పొంద

Raarandi Yesu Paadhamula Chera Paapa Vimukthi Pondha

Verse 1
Reference: నా యొద్దకు వచ్చువాని నేనెంత మాత్రము బయటకి త్రోసివేయను యోహాను John 6:37
Chorus
రారండి యేసు పాదముల చేర - పాప విముక్తి పొంద
Verse
వచ్చువారల త్రోయనని - నెచ్చెలు డేసు వాక్కు నిచ్చెను
Verse
జాగేల పాపి నీవింకను చావునకు తప్పెదవా?
సద్గురు చరణము వెదకిన - సద్గుణముగ నిను మార్చును
Verse
ఆశతో యేసు నిలిచియున్నాడు పాపీ నిన్ను రక్షింపను
జీవితము మోసమగుచున్నది - పాపీ యేసుని రక్షణ వెదుక
Verse
నేడే నే మరణించిన నెచట చేరుదునని తలచి
యేసుని చెంత రమ్ము తరుణము - దొరుకదు గుణపడుము వేగమే
Verse
ఈ ప్రేమ ఉత్కృష్టమని యెంచి వెంటనే రారమ్ము
నీదు పాపముల క్షమింపను - నాథు డేసుడు సిల్వ నెక్కెను
Verse
పాపము శాపము తోడను వచ్చెదనని చెప్పుము
జీవ దేవాది దేవుడు నీకై - చేయునదెల్ల పరికింపను
Verse
మాయవేషముల ధరియించి కాలము వ్యర్థపరచి
తప్పుడు బోధ చేయువారల - వీడి పరమున జేరనిచటకు
Verse
కడపటి కాలమిదే యగును ఇల మోసపోకుడి
మిత్రుడేసుడు మీకు ఇచ్చిన - దాని పొందుచు పాడు డల్లెలూయా

Related Tags

InvitationRepentanceSalvation