Verse
రారే చూతము రాజసుతుని
రేయి జనన మాయెను‖ 2x ‖
రాజులకు రారాజు మెస్సయ్యా‖ 2x ‖
రాజితంబగు తేజమదిగో‖ 2x రారే ‖
Verse
దూత గణములన్ దేరి చూడరే
దైవ వాక్కులన్ దెల్పగా‖ 2x ‖
దేవుడే మన దీనరూపున‖ 2x ‖
ధరణి కరిగె-నీ దినమున‖ 2x రారే ‖
Verse
కల్లగాదిది కలయు గాదిది
గొల్ల బోయుల దర్శనం‖ 2x ‖
తెల్లగానదే తేజరిల్లెడి‖ 2x ‖
తార గాంచరే త్వరగ రారే‖ 2x రారే ‖
Verse
బాలు-డడుగో వేల సూర్యుల
బోలు సద్గుణ శీలుడు‖ 2x ‖
బాల బాలిక బాలవృద్ధుల‖ 2x ‖
నేల గల్గిన నాథుడు‖ 2x రారే ‖
Verse
యూదవంశము నుద్ధరింప
దావీదుపురమున నుద్భవించె‖ 2x ‖
సదమలంబగు మదిని గొల్చిన‖ 2x ‖
సర్వ జనులకు సార్వభౌముడు‖ 2x రారే ‖