Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raare Choothumu Raajasuthudee Reyi Janana

రారె చూతుము రాజసుతుడీ రేయి జనన

Raare Choothumu Raajasuthudee Reyi Janana

Lyricist: Chetti Bhanumurthy
Chorus
రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను రాజులకు రా
రాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో‖ రారె ‖
Verse
దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా దేవుడే
మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున‖ రారె ‖
Verse
కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం తెల్లగానదె
తేజరిల్లెడి తారగాంచరె త్వరగ రారే‖ రారె ‖
Verse
బాలు డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు బాల బాలికా
బాలవృద్ధుల నేల గల్గిన నాధుడు‖ రారె ‖
Verse
యూద వంశము ను ద్ధరింప దా వీదుపురమున నుద్భవించె
సదమలంబగు మదిని గొల్చిన సర్వ జనులకు సార్వభౌముడు‖ రారె ‖

Related Tags

ChristmasNativity