Chorus
రారె గొల్లవారలారా నేటి రాత్రి బేత్లెహేము నూర జేరి మోక్షదూత
కోరి దెల్పెను క్రీస్తు వారి జాడకన్ను లారా జూతము వేగ‖ రారె ‖
Verse
పుట్టు చావులు లేనివాడఁట పసుల తొట్టిలోపలఁ బుట్టెనేడఁట ఎట్టి
వారలను జే పట్టి పాపము లూడఁ గొట్టి మోక్షపుత్రోవఁ బెట్టు వాడట వేగ‖ రారె ‖
Verse
బహుకాలమాయెను వింటిమి నేడు మహికివచ్చుట కనుగొంటిమి
విహితముతోడ సేవించి వత్తము మోక్ష మహితుని గని దుఃఖ రహితులమవుదము.‖ రారె ‖