Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raare Mana Yesu Swaamini Jootamu Ko

రారే మన యేసు స్వామిని జూతము కో

Raare Mana Yesu Swaamini Jootamu Ko

Lyricist: Purushothamu Choudari
Chorus
రారే మన యేసు స్వామిని జూతము కోర్కె లూర ప్రియు
లారా పేర్మిని గూరిమి భక్తులఁ విందుట భూరిద యామృత
సారము లోలికెడు చారు కటాక్ష వి శాలేక్షణుఁడఁట నారకులగు
నర నారీజనులకు దారక మొసఁగను దానె పిలుచునఁట దారుణ
పాప మ హారణ్యమునకుఁ గారుచిచ్చు గతి గంపడువాఁడట
ఘోరదరిద్రతఁ గూల్చెడివాఁడట సారం బగు తన సభకు మకుటమఁట‖ రారే ‖
Verse
పతిత పావనమౌ వేల్పఁట అనాది దేవ సుతుడై యిలఁ జేరి నాఁడఁట
సతతము కడు దురి తతమోయుతమగు ప్రతి దేశమునకు
హితభాస్కరుఁడఁట అతిలిత మోక్షో న్నత గుణగణుఁడఁట
కుతలంబున స ద్గతి రహితంబగు పతితులఁ గావను మృతుడైనాఁడఁట
అతిపుణ్య తను క్షత శోణితమును వ్రతముగ సిలువను
నతడొసంగెనఁట మృతిని జయించుచు బ్రతికి లేచెనఁట మతి నమ్మిన
మన గతి యితఁడేనఁట‖ రారే ‖
Verse
తుదిలేని మహిమవాఁడఁట తనుఁగొల్చు సాధు హృదయుల సొమ్ము
మూటఁట చెదరిన గొఱ్ఱెల వెదకవచ్చెనఁట చిదురుపలగు జన
హృదయము లన్నిటఁ బదిలముగా నె మ్మది నిడువాఁడఁట నదితట
మఠ జన వదనముల స మ్మద శుభవార్తనుఁ బలికినవాఁడఁట
సదయత నంధుల కక్షుల నిడెనఁట వెదకి బధిరులకు వీను
లొసఁగె నఁట సదమల మోక్ష ప్రదుఁడగు విభుఁడఁట యిదిగో
మనకిత డేలినవాఁడఁట‖ రారే ‖

Related Tags

WorshipInvitationJesus