Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raare Raare O Janulaara

రారే రారే ఓ జనులారా

Raare Raare O Janulaara

Verse
రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్
సక్కనైన బాల యేసుని చూతము రారండోయ్‖ 2x ‖
పాపాలు బాపునంట – రోగాలు తీర్చునంట
లోకాన పండగంట‖ 2x రారే ‖
Verse
మనుషుల పాపము బాప మహిమనే వీడాడంట
మనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడోయ్‖ 2x ‖
మహిమ రాజ్యము నాడు మనకీయ పుట్టెనులే
మహిమా స్వరూపుడు మరణానికి తల ఒగ్గాడోయ్‖ 2x రారే ‖
Verse
రాజుల రాజుగ యేసు రాజ్యమే మనకీయగను
పాపపు దాస్యము నుండి విడుదల నిచ్చుటకు‖ 2x ‖
పాప భారము మోసి మరణ కోరలు విరచి
శాశ్వత జీవమునివ్వగ మరణము గెలిచాడోయ్‖ 2x రారే ‖

Related Tags

ChristmasCelebration