Chorus
రారో జనులారా వేగముఁ గూడి రారో ప్రియులారా శాశ్వతమైన
ఘన రక్షణఁ జేర సారాసారముల్ సమ్మతిగాఁ జూచి ధీరత్వమునఁ
క్రీస్తు జేరు దారిఁ గోరి‖ రారో ‖
Verse
అనుమానము లన్ని మీరలు మాని ఆద్యంతము లేని కనికరము
చేత మనల రక్షింపను దన జీవము నిచ్చు ఘనునిఁ క్రీస్తుని గొల్వ‖ రారో ‖
Verse
మన పాపము లన్ని మోయను దే వుని చేఁ బనిఁ బూని మనుజావ
తారుఁడై వినుట కద్భుతమైన పను లెన్నో చేసి సి ల్వను బడిన ఘనుఁ
జేర‖ రారో ‖
Verse
పాపాత్ము లగు వారి భారముఁ ద్రుంచు బలుడైన యుపకారి
ఓపికతో ఁ దన దాపుఁ జేరిన వారి శాపము తా మోసి కాపాడు
ఘనువేడ‖ రారో ‖
Verse
తన యాత్మకుఁ గీడు గల్గించెడు ఘనత లెల్లను పాడు తనువు
నిత్యము గా దని యభిమాన మును వీడి మన క్రీ స్తుని జడ గతిఁజూడ‖ రారో ‖
Verse
సకలాంతర్యామి నిరాకారు డొకడే యంతట సామి ప్రకట ముగా
మర్త్యు లకునెల్ల మధ్యస్థు డొకడే క్రీస్తుడు సం రక్షకుడై యిలుకు వచ్చె‖ రారో ‖