Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raathi Kundanu Nenu Khaaliyai Yunnaanu

రాతి కుండను నేను ఖాళియై యున్నాను

Raathi Kundanu Nenu Khaaliyai Yunnaanu

Chorus
రాతి కుండను నేను - ఖాళియై యున్నాను
నింపుమా.. అంచులవరకూ‖ 2x ‖
నీకింపుగా.. మార్చబాడుటకు‖ 2x ‖
Verse
వెఱ్ఱి ద్రాక్షలు.. లోనికి చేరెను - అంతరంగము చేదుగా మారెను.
మాధుర్యం పంచుటకు.. తగిన పాత్రగా‖ 2x ‖
శుభ్రము చేయుమా - నను శుభ్రము చేయుమా
నింపుమా.. అంచులవరకూ‖ 2x ‖
నీకింపుగా.. మార్చబడుటకు‖ 2x ‖
Verse
జీవ డంభము మిగిలి యుండెను - లోకస్నేహము చెరుపుచుండెను
మాలిన్యం ఏమాత్రం అంటకుండగా‖ 2x ‖
భద్రము చేయుమా - నను భద్రము చేయుమా
నింపుమా.. అంచులవరకూ‖ 2x ‖
నీకింపుగా.. మార్చబడుటకు‖ 2x ‖
Verse
తప్పుబోధకు కలతచెందక - చెడ్డమాటతో శ్రమను పొందక
నీకోసం నమ్మికతో - ఎదురుచూడగా‖ 2x ‖
సిద్ధము చేయుమా - నను సిద్ధము చేయుమా
నింపుమా.. అంచులవరకూ‖ 2x ‖
నీకింపుగా.. మార్చబడుటకు‖ 2x ‖

Related Tags

HolinessSurrenderConsecration