Verse
రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా
నేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై‖ 2x ‖
Verse
లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను
లోక నాథుడై మరియకవతరించెను‖ 2x ‖
ఇతండె దేవుడాయెను‖ 6x రాత్రి ‖
Verse
బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము
యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము‖ 2x ‖
ఈ నాడే మనకు పండగ
రారండి ఆడి పాడగ‖ 3x రాత్రి ‖
Verse
ఆకశాన తార ఒకటి బయలుదేరెను
తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను‖ 2x ‖
చిన్నారి యేసు బాబును
కళ్లారా చూసి మురిసెను‖ 3x రాత్రి ‖
Verse
పొలములోని గొల్లవారి కనుల ముందర
గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా‖ 2x ‖
మేరమ్మ జోల పాడగా
జగాలు పరవశించెగా‖ 3x రాత్రి ‖
Verse
లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను
భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను‖ 2x ‖
ఇతండె దేవుడాయెను‖ 6x రాత్రి ‖