Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raathrimbavallu Paadedhanu Yaesu Naamam Kreesthu Naamam

రాత్రింబవళ్లు పాడెదను యేసు నామం క్రీస్తు నామం

Raathrimbavallu Paadedhanu Yaesu Naamam Kreesthu Naamam

Chorus
రాత్రింబవళ్లు పాడెదను
యేసు నామం - క్రీస్తు నామం
Verse
పురుగు వంటి నరుడ నాకు - ప్రభువు రాజ్య మియ్యదలచి
పరమునుండి ధరకేతెంచి - ప్రాణమున్ బలిగా నిచ్చె
Verse
ఎన్నిక లేని చిన్నమంద - భయపడకు నీవిలన్
ఘనమైన పరమతండ్రి - రాజ్యమివ్వ నిష్టపడెన్
Verse
పాప కూపమునందు నేను - పడి చెడి యుండగా
గొప్ప రక్షణ నిచ్చి పరమ - రాజ్యమందు చేర్చెను
Verse
నీతి హేనుడనైన నాకు - నీతి రాజ్యమివ్వదలచి
నీతి రక్షణ వస్త్రములను - ప్రీతి తోడ తొడిగెను
Verse
పేరుపెట్టి పిలచినన్ను - పరమ రాజ్యమును తండ్రి
వారసునిగా నన్ను జేసి - వైరినిల సిగ్గుపరచెన్
Verse
పరమందు దూతలు - వింత పొందునట్లుగా
ఏర్పరచుకొంటివి నరుని - నరుడు ఏపాటి వాడు?
Verse
దానియేలు షద్రక్ మేషాక్ - అబెద్నెగో యనువారలన్
చిన్నమందగా జేసి - రాజ్యమేల జేసెన్
Verse
ఎన్ని శ్రమలు వచ్చినను - సన్నుతింతు నా ప్రభున్
ఘనత మహిమ కర్హుడని - హల్లెలూయ పాడెదన్

Related Tags

PraiseWorshipJesus