Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raathriyayyena Nnedaobaayaku Dhaa

రాత్రియయ్యెన న్నెడఁబాయకు ధా

Raathriyayyena Nnedaobaayaku Dhaa

Lyricist: Henry Francis Lyte
Verse
రాత్రియయ్యెన న్నెడఁబాయకు
ధాత్రిపైఁ జీఁకతులుఁ గ్రమ్మెను
సహాయ మేమి లేనివారికి
సహాయుఁడా, నన్ బాసిపోకుమీ.
Verse
ఏకాలంబైన నీ సహాయము
లేక పిశాచిన్ గెల్వఁజాలను
నీకంటె నాకు లేదుగా
లోక ప్రకాశుఁడా, నన్ బాయకు.
Verse
నా చెంత నీవు చేరియుండఁగ
ఏ చింతయైన నన్ను సోకునా
ఏ శత్రువైన నన్ను గెల్చునా?
నా శైలమా, నన్ బాసిపోకుమా.
Verse
సమృద్ధుఁడు సహాయుఁ డాయెను
ఓ మృత్యువా నీ ముల్లు గెల్చునా?
సమాధి నీకు జయమబ్బునా?
మా మధ్యమున్ సర్వేశ పాయకు.
Verse
రేవు నేఁ జేరఁబోవు వేళలోన్
కావుమయ్యా నీ దీప్తిఁ జూపుచున్
చావు జీవంబులందు నైనను
నీవు తోడై నన్ బాసిపోకుము.

Related Tags

PrayerEvening