Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raavayya Yesunaadha Maa Rakshana Maargamu

రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము

Raavayya Yesunaadha Maa Rakshana Maargamu

Verse
రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము
నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు
Verse
హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి
మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను
Verse
నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి
మా గండంబులన్నియు ఖండించుటకు
Verse
పాపుల మయ్యమేము పరమ తండ్రిని గానకను
మా పాపంబు లన్నియు పారద్రోలుటకు
Verse
అందమైన నీదు పరమానంద పురమందు
మే మందరము జేరి యానందించుటకు

Related Tags

PrayerSalvationJesus