Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raavayya Yesunaadhaa Maa Rakshanaamaargama

రావయ్య యేసునాధా మా రక్షణమార్గమ

Raavayya Yesunaadhaa Maa Rakshanaamaargama

Chorus
రావయ్య యేసునాధా మా రక్షణమార్గము నీ సేవఁ జేయ మమ్ముఁ
జేపట్టుటకు‖ రావయ్య ‖
Verse
హద్దు లేక మేము ఇల మొద్దులమై యుంటిమి మా కొద్ది బుద్ధులన్ని
దిద్ది రక్షింపను‖ రావయ్య ‖
Verse
నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి మా గండంబు
లన్నియు ఖండించుటకు‖ రావయ్య ‖
Verse
మేర లేని పాపము మాకు భారమైన మోపు నీవు దూరంబుగాఁ
జేసి దారిఁ జూపుటకు‖ రావయ్య ‖
Verse
పాపుల మయ్య మేము పరమ తండ్రిని గానకను మా పాపంబు
లన్నియుఁ పారఁ దోలుటకు‖ రావయ్య ‖
Verse
అందమైన నీదు పరమానంద పురమందు మే మందరముజేరి
ఆనందించుటకు‖ రావయ్య ‖

Related Tags

PrayerRepentanceSalvation