Verse
రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము
నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు
Verse
హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి
మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను‖ రావయ్య ‖
Verse
నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి
మా గండంబులన్నియు ఖండించుటకు‖ రావయ్య ‖
Verse
మేర లేని పాపము మాకు భారమైన మోపు
నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు‖ రావయ్య ‖
Verse
పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను
మా పాపంబులన్నియు పారద్రోలుటకు‖ రావయ్య ‖
Verse
అందమైన నీదు పరమానంద పురమందు
మేమందరము జేరి యానందించుటకు‖ రావయ్య ‖