Chorus
రావయ్యా యేసయ్యా నా ఇంటికి
నీ రాకకై నే వేచియుంటిని
రావయ్యా యేసయ్యా నా ఇంటికి
నీ రాకకై నే వేచియుంటిని‖ 2x ‖
కన్నులార నిన్ను చూడాలని‖ 2x ‖
కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను‖ 2x ‖
Verse
యదార్థ హృదయముతో నడచుకొందును
ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను‖ 2x ‖
భక్తిహీనుల క్రియలు నాకంటనీయను
మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును‖ 2x ‖
Verse
దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను
నా పొరుగు వారిని దూషింపను‖ 2x ‖
అహంకారము గర్వము నంటనీయను
నమ్మకస్థునిగా నే నడచుకొందును‖ 2x ‖
Verse
నిర్దోష మార్గముల నడచుకొందును
మోసము నా ఇంట నిలువనీయను‖ 2x ‖
అబద్ధికులెవ్వరిని ఆదరింపను
భక్తిహీనుల మార్గము నే త్రొక్కను‖ 2x ‖