Chorus
ఱేఁడు మెస్సీయ జన్మించెను శ్రీదా వీదు పురమున నుద్భువించెను
వేడుకతోడను బాడుఁడి పాటలు రూఢిగ సాతాను కాడిని దొలఁగింప‖ ఱేఁడు ‖
Verse
మనకొఱకై శిశువు పుట్టెను అతఁడు మన దోషములను బోగొట్టెను
అనయంబు నతనిమీఁ దను రాజ్యపు భార ము నుంచఁబడె విమో
చనకర్త యితఁ డౌను‖ ఱేఁడు ‖
Verse
పరలోక సైన్యంబు గూడెను మన వర శిశువును గూర్చి పాడెను
నరులయందున గరుణ ధర సమాధానంబు చిర దేవునికి బహు
మహిమ యటంచును‖ ఱేఁడు ‖
Verse
కొమ్మ యెష్షయినుండి పుట్టెను చిగురు క్రమ్మర మొద్దున బుట్టెను
కమ్మొను దేవుని యా త్మమ్మును తెలివి జ్ఞా న మ్మలోచన మహ త్వ
మ్మొక్కుమ్మడినాతని‖ ఱేఁడు ‖
Verse
సర్వశక్తి గల దేవుఁడు మరియు నుర్వియందు దయాస్వభావుఁడు
సర్వమహిమము గల్గు స్వర్గ లోకము వదలి గర్వముతో నిండిన సర్వంసహా
స్థలిపై‖ ఱేఁడు ‖
Verse
వింతైన వాఁడుగ నుండెను కోరినంత సుందరత లేకుండెను చింతతోడను
మాయా సంగతులగు వారి యంతములేనట్టి యాపదను వీక్షించి‖ ఱేఁడు ‖
Verse
చెదరిన గొఱ్ఱెల వెదకును వాని ముదమున మందలోఁ జేర్చును
సదయత యేసుండు జనితైక సుతుఁడు భా స్వదధిక విభుఁడాలో చన
కర్త జన్మించె‖ ఱేఁడు ‖
Verse
అక్షయుండగు యేసు వచ్చెను మన రక్షణమ్మును సిద్ధపర్చెను
మోక్షము సరుణా క టాక్షమ్ముతో నియ్య నీక్షితియందున హెబ్రీ
వంశమునందు‖ ఱేఁడు ‖