Verse 1
Reference: కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు కీర్తన 126:5
Verse
రేపు మాపు గూడ రమ్యమైన గింజల్
ప్రీతితోను జల్లివేసి యుందుము
కాపుతోడనుండి దాపునుండు పంట
నేపు మీరబంటగోసి కొందము
Chorus
పంట పండగన్ గోసి కొందము
కంట నీరు పోవ గోసి కొందము
Verse
సందియంబు లేల స్వామి సేవ యందు
నందనంబు తోడ విత్తుచుందుము
కొందలంబులేక కష్టవృత్తిచేసి
యందరము చేరి యానందింతుము
Verse
ప్రేమ విత్తనంబుల క్షేమ యంకురంబుల్
ప్రీతిన్ గాలమెల్ల ప్రాంతమంతటన్
నేను మొప్ప నాటి నాయకుండు
నిండు పంట గోసి గూర్చుకొందము