Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rajula Rajuvayya Neeve Maa Rajuvayya

రాజుల రాజువయ్యా నీవే మా రాజువయ్యా

Rajula Rajuvayya Neeve Maa Rajuvayya

Verse
రాజుల రాజువయ్యా నీవే మా రాజువయ్యా
రాజాధిరాజువయ్య నీవే మహా రాజువయ్యా
ఇహలోకాన్ని పాలించే నాధుడ నీవయ్యా‖ 2x ‖
మహిమయు ఘనతయు ఇహమందు పరమందు చెల్లును‖ 2x ‖
Verse
నోటిమాటతో భూమిని చేసెన్ నేలమంటితో మనిషిని రూపించెన్
జీవము పోసి జీవాయువు నూదెన్ శూన్యములోనే సర్వసృష్టిని చేసెన్
మహిమయు ఘనతయు ఇహమందు పరమందు చెల్లును‖ 2x స్తోత్రాలయ్యా…. ‖
Verse
నీ చెంగు ముట్టిన స్వస్థత కలిగెన్ నీ చేయి తాకిన శవములు లేచెన్
సాతాను శక్తులే గడగడగడలాడెన్ సేనా దయ్యమే గజగజగజ వణికెన్
మహిమయు ఘనతయు యుగయుగములు నీకే చెల్లును‖ 2x హల్లెలూయా......... ‖
Verse
రాతిబండతో దాహము తీర్చెన్ చేతి కర్రతో సంద్రాన్ని చీల్చెన్
రొటెను విరచి వేవేలకు పంచెన్ ప్రాణాన్నిచ్చి మాకు రక్షణ నిచ్చెన్
మహిమయు ఘనతయు యుగయుగములు నీకే చెల్లును‖ 2x వందనమయ్యా. ‖

Related Tags

PraiseWorshipCreation