Chorus
రాజులకు రాజైన యేసు ప్రభు రానై యున్నాడు‖ 2x ‖
ఎత్తబడెదవా లేక విడువబడెదవా?‖ 2x ‖
Verse
తెలిసికొంటివా నీవెంత ఘోరపాపివో
సిలువపై తీర్చెగా నీ పాప ఋణమున్
ఒప్పుకొనిన పాపమున్ క్షమించు యేసు
లేని యెడల విడువబడెదవు సిద్ధపడుమా
Verse
బుద్ధిలేని కన్యకవలె మోసపోతివా
చేయలేవు ప్రభుసేవ నీ శక్తితో
నూనెలేక భ్రమతో బ్రతికెదవా
లేని యెడల విడువబడెదవు సిద్ధపడుమా
Verse
వాక్యముకై జీవితం అప్పగింపక
దాచితివా తలాంతులను లెక్కచేయక
మొదటి ప్రేమను తిరిగి పొందుమా
లేని యెడల నష్టపోదువు సిద్ధపడుమా
Verse
ప్రాణమిచ్చి విమోచించి నీ ప్రేమతో
కృపనుబట్టి నడిపితివి నాదు యాత్రలో
ముగియువరకు సిద్ధపరచు నీ రాకకై
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా