Verse
రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా
సత్యమైన నిత్య ప్రేమ చూపిన దేవా
Verse
దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు?
దూతలైనను ప్రధానులైనను
ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
Verse
నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను
కరువైనను ఖడ్గమైనను
Verse
సర్వలోకరక్షణకై సిలువనెక్కెను
శ్రమయైనను బాధయైనను
Verse
ఎంచలేని యేసునాకై హింసపొందెను
హింసయైనను హీనతయైనను
Verse
మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెను
మరణమైనను జీవమైనను
Verse
నిత్యుడైన తండ్రితో నన్ను జేర్చెను
ఎత్తైనను లోతైనను
Verse
ఎన్నడైన మారని మా యేసుడుండగా
ఉన్నవైనను రానున్నవైనను
ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ