Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rakshakudu Vachchinaadu

రక్షకుడు వచ్చినాడు

Rakshakudu Vachchinaadu

Lyricist: Davidson Gajulavarthi
Verse
రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా
నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా‖ 2x ‖
పాపమే లేనోడమ్మా పాపుల రక్షకుడమ్మా
ప్రాణమియ్య వెనుకాడని ప్రేమామయుడోయమ్మా
మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా
జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా‖ 2x ‖
Verse
ప్రవక్తల ప్రవచనాలు నేరవేర్చాడమ్మా
మోడుబారిన బ్రతుకులలో దావీదు చిగురమ్మా‖ 2x ‖
బాలుడై వచ్చాడమ్మా భారమే మోసాడమ్మా
విడుదలనే ఇచ్చిన దేవుని గొర్రెపిల్లమ్మా‖ మన కోసం ‖
Verse
వినరే ప్రేమామయుని చరితం వినరే జనులారా
నమ్మితే చాలు మోక్షమునిచ్చును నమ్ము మనసారా‖ 2x ‖
వెల తానే చెల్లించి తన వారసులుగ ఎంచి
నిత్యం తనతో ఉండే భాగ్యమునిచ్చాడమ్మా‖ మన కోసం ‖

Related Tags

SalvationJesusChristmas