Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rakshakudu Vachinadu Vachinadamma

రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా

Rakshakudu Vachinadu Vachinadamma

Lyricist: Davidson Gajulavarthi
Verse
రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా
నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా
పాపమే లేనోడమ్మా పాపుల రక్షకుడమ్మా
ప్రాణమియ్య వెనుకాడని ప్రేమామయుడోయమ్మా
మన కోసం ఇలకొచ్చిన యేసు రాజుడితఁడమ్మా
జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా
Verse
ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చాడమ్మా
మోడుబారిన బ్రతుకుల్లోన దావీదు చిగురమ్మా
బాలుడై వచ్ఛాడమ్మా భారమే మోశాడమ్మా
విడుదలనే ఇచ్చిన దేవుని గొర్రెపిల్లమ్మ
వినరే ప్రేమామయుని చరితం వినరే జనులారా
నమ్మిక చాలు మోక్షమునిచ్చును నమ్ము మనసారా
వెల తానే చెల్లించి తన వారసునిగా ఎంచి
నిత్యం తనతో ఉండే భాగ్యమునిచ్చాడమ్మా

Related Tags

SalvationJesusChristmas