Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rakshakundudayinchinaadata

రక్షకుండుదయించినాడట

Rakshakundudayinchinaadata

Lyricist: Mocharla Raghavaiah
Chorus
రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార
తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము‖ రక్షకుండు ‖
Verse
దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు‖ 2x ‖
దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు‖ రక్షకుండు ‖
Verse
గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత‖ 2x ‖
తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త‖ రక్షకుండు ‖
Verse
వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు‖ 2x ‖
కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు‖ రక్షకుండు ‖
Verse
పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి‖ 2x ‖
శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె‖ రక్షకుండు ‖
Verse
అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు‖ 2x ‖
అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు‖ రక్షకుండు ‖

Related Tags

Christmas