Chorus
రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ రక్షకుం డుదయించి
నాఁడఁట రక్షకుం డుదయించినాఁడు రారె గొల్లబోయలార తక్షణమునఁ
బోయి మన ని రీక్షణ ఫల మొందుదము‖ రక్షకుండు ‖
Verse
దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాఁడు దేవుఁడగు యెహోవా
మన దిక్కుఁ దేరి చూచినాఁడు‖ రక్షకుండు ‖
Verse
గగనమునుండి డిగ్గి ఘనుఁడు గబ్రియేలు దూత తగినట్టు చెప్పె వారికి
మిగుల సంతోషవార్త‖ రక్షకుండు ‖
Verse
వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాఁడు కర్తను జూచిన
వెనుక కాంతుము విశ్రమం బప్పుడు‖ రక్షకుండు ‖
Verse
పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి శిశువును గనుగొందురని
శీఘ్రముగను దూత తెల్పె‖ రక్షకుండు ‖
Verse
అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు అనుమతించి
కడకుఁ క్రీస్తు నందరికినీ దెల్పినారు‖ రక్షకుండు ‖