Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rakshakundudhayinchi Naadata Mana Koraku Barama Rakshakundudhayinchi

రక్షకుండుదయించి నాడట మన కొరకు బరమ రక్షకుండుదయించి

Rakshakundudhayinchi Naadata Mana Koraku Barama Rakshakundudhayinchi

Chorus
రక్షకుండుదయించి నాడట - మన కొరకు - బరమ రక్షకుండుదయించి
నాడట - రక్షకుండుదయించి నాడట - రారె - గొల్లబోయలార
తక్షణమున - బోయి మన నిరీక్షణ ఫలమొందెదము
Verse
దావీదు వంశమందు ధన్యుండు జన్మించినాడు దేవుడగు
యెహోవా మన దిక్కు జేరి చూచినాడు‖ రక్షకుండు ‖
Verse
గగనమునుండి దిగి - ఘనుడు గబ్రియేలు దూత తగినట్టు
చెప్పె వారికి మిగుల సంతోషవార్త‖ రక్షకుండు ‖
Verse
వర్తమానము జెప్పి దూత - వైభవమున బోవుచున్నాడు కర్తను
జూచిన వెనుక కాంతుము విశ్రమం బప్పుడు‖ రక్షకుండు ‖
Verse
పశువుల తొట్టిలోన - భాసిల్లు వస్త్రముల జుట్టి శిశువును
గనుగొందురని - శీఘ్రముగను దూత తెల్పె‖ రక్షకుండు ‖
Verse
అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు - అనుమతించి
కడకు క్రీస్తు నందరికినీ దెల్పినారు‖ రక్షకుండు ‖

Related Tags

ChristmasNativity