Verse
రక్షకుని విచిత్ర ప్రేమన్ - పాడుచుందు నెప్పుడున్
క్రూర సిల్వమీద మృతి నొంది నన్ విమోచించెన్
Chorus
పాడుడి రక్షకుని గూర్చి రక్తముతో కొనియె నన్
సిల్వపై రక్షణ ముద్రించి పాప అప్పును తీర్చెను
Verse
తెల్పుదున్ విచిత్ర కథన్ - పాడైన నా స్థితిని
కాచి కృపా ప్రేమతోడ - నన్ను విమోచించెను
Verse
ప్రియ రక్షకును పాడి - జయశక్తి తెల్పుదున్
పాపమృతి పాతాళము - పై విజయమిచ్చెను
Verse
నా రక్షకుని పరమ పాడి - ప్రేమగూర్చి పాడుదున్
చావు నుండి జీవమునకు - తెచ్చె దైవసుతుడు