Chorus
రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును
పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది
Verse
మలిన వస్త్రమువలెనే - నిండియుంటిమి నిందలతో
తండ్రిమాదిరిగా మము వెదకివచ్చి వింతగా మమ్మురక్షించెను
Verse
అరణ్య ప్రదేశములో - పాడైన యెడారిలో
కనుగొనెను, పరామర్శించెన్ కనుపాపవలె గాచెన్
Verse
యాకోబువలె నుంటిమి - ఇశ్రాయేలుగా మార్చెను
తన స్వాస్థ్యముగా, తన భాగముగా తన జనముగానైతిమి
Verse
పర్వతములను సృజించెన్ - శ్రేష్టమైనవి నిచ్చెన్
అబ్రహాం మోషే ఏలియా యేసు ఎక్కిరి శిఖరములను
Verse
పక్షిరాజువలె ప్రభువు - రెక్కలతో మము మోయున్
అలసట లేక, మము పట్టుకొని ఆకసమున నడుపును
Verse
యేసుని సత్యములు - పర్వత శిఖరములు
పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింప జేయును
Verse
యేషయా ప్రవచనములు - రక్షణ వివరములు
శిఖర శ్రేణి యనుభవములు శిఖరముపై పొందుము