Verse
రక్షణ నొసగెడు యేసుని ప్రేమను
లక్ష్యము చేయుము ఓ ప్రియుడా
అక్షయ రాజ్యము నీయను వచ్చిన
రక్షకున్ బొగడుము స్నేహితుడా
Verse
లోకపు ప్రేమను యేమని తెల్పెద
నీ కవమానంబే దలచినచో
మారని యేసుని రక్షకున్ ప్రేమ
తాకుడు నొందుము ఓ ప్రియుడా
Verse
పాపపు ప్రేమలో విడువక నిలిచిన
తాపము చెందెద వో నరుడా
పాపిని గావను ప్రేమ స్వరూపుడు
శాపము నోర్చెను కల్వరిలో
Verse
చచ్చిన పాపిని వెదకి రక్షింప
చచ్చి బ్రతికిన ఘనుడెవడు
వచ్చిన పాపిని వద్దని త్రోయని
నిశ్చల ప్రేమామయుడు యేసే
Verse
నమ్ముము సోదరా నిన్ను రక్షించును
నెమ్మది నొందెదవు నిజము
నమ్మినచో ప్రభుప్రేమను గానవు
నమ్ముము ప్రభు ప్రేమ నీదినమే
Verse
ఘన ధనికుల మత సౌందర్యంబులన్
గానవు నిజ ప్రేమాదరణల్
ఎన్నిల నున్నను నిలచునే నిత్యము
పెన్నుగ బొందుము ప్రభు ప్రేమన్
Verse
తండ్రి కుమార శుద్ధాత్మల చిత్తమున్
దండిగ నెరవేర్చు ఘనులు
ఎందరో వేగిరి పొందను మకుటము
పొందుము ప్రభు ప్రేమ హల్లెలూయ