Verse
రక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదు
గురి నిలిపి పయనిస్తున్నావా
రక్షకుని ఎరిగిన నీవు – తానెవరో తెలియదు నాకు
అన్నట్టు జీవిస్తున్నావా‖ 2x ‖
యేసే లేని నీ బ్రతుకులో
వెలుగే లేదు అది తెలుసుకో
యేసే లేని నీ జీవితానికి
విలువే లేదు అది తెలుసుకో‖ 2x రక్షింపబడిన ‖
Verse
మంటితోనే నిను చేసినా
కంటి పాపగా కాపాడెనే
మాటి మాటికి పడిపోయినా
శాశ్వత ప్రేమతో ప్రేమించెనే‖ 2x ‖
ఆ ప్రేమను కాదని – అవసరమే లేదని
ఈ లోకం నాదని – ప్రభు మార్గం విడచితివా
యేసే లేనిచో – పరలోకానికి
ప్రవేశం లేదనే – పరమార్ధం మరచితివా‖ యేసే ‖
Verse
యేసులోనే నీ రక్షణ
యేసులోనే నిరీక్షణ
యేసులోనే క్షమాపణ
చేసుకో మరి ప్రక్షాళన‖ 2x ‖
ఎంతో ప్రేమను – నీపై చూపించెను
తన ప్రాణము సైతము – నీకై అర్పించెనుగా
ఇప్పటికైననూ – మార్చుకో మనస్సునూ
ప్రభువును చేరగా – వేగిరమే పరుగిడిరా‖ యేసే ‖