Intro
Reference: ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల యోహాను John 1:29
Verse
దేవ గొర్రెపిల్ల సిలువలో సమసినపుడు
పాప పరిహారార్థ ఊట తెరచెన్
పాపి నీవు ఆరక్తమందు నిలచియున్నావా!
ఇపుడు విడుదలను కోరి పొందెదవా!
Chorus
రక్తమందు రక్తమందు
పాపి నీవు ఆ రక్తమందు నిలిచియున్నావా?
రక్తమందు రక్తమందు - ఇపుడు విడుదలను కోరి పొందెదవా?
Verse
అపవిత్రుడైనను అక్రమస్తుడైనను
ఆ పవిత్రరక్తము శుద్ధిచేయును
ఏలు పాపమైనను - అతిక్రమమైనను
ఏలికచే మన్నింపబడి యున్నావా?
Verse
ప్రియులారా యను ప్రభుని పిల్పు వింటివా?
మాయవేషమంతయు వీడియున్నావా?
పాప బంధము లింక నిన్ను కట్టియున్నవా?
శాపలోకముపై జయ మొందుచున్నావా?
Verse
ఆత్మజీవ శరీరంబుల నర్పించితివా?
అల్పవిషయములోను సత్యమున్నదా?
నాడు మరణించిన యేసులేచియున్నాడు
నేడుయేసున్ చేరిన యభయ మిచ్చును
Verse
పంచఖండములను రక్షించుట కొరకు
పంచగాయ మొందిన ప్రభుని చూడుమా
ఇంచుకైన త్రోయడు డాసినట్టి వారల
మించు సత్యములను కోరి వెదకుము
Verse
రేపు రేపు యనుట నమ్మిక కానేరదు
మాపు మరణించిన నెచటి కేగుదువు?
ప్రాపకుండగు యేసుని చిత్తమును జరిపిన
శ్రీ పాలుండు నిన్నుత్తముండని మెచ్చును
Verse
హల్లెలూయా పాడుము శక్తిగల యేసుకు
కల్ల కార్యములను విడచివేయుము
చెల్లచెదరగును కష్టము లచ్చోటను
కొల్లగా ననుభవింతువు సుఖంబును