Verse 1
రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి
రమ్మనుచున్నాడు‖ 2x ‖
Verse
ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని‖ 2x ‖
గ్రహించి నీవు యేసుని చూచిన
హద్దు లేని ఇంపు పొందెదవు‖ 2x రమ్మను ‖
Verse
కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్‖ 2x ‖
కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ
కనికరించి నిన్ను కాపాడును‖ 2x రమ్మను ‖
Verse
సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును‖ 2x ‖
ఆయన నీ వెలుగు రక్షణనై యుండును
ఆలసింపక త్వరపడి రమ్ము‖ 2x రమ్మను ‖
Verse
సకల వ్యాధులను స్వస్థత పరచుటకు‖ 2x ‖
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో
అందరికి తన కృపలనిచ్చున్‖ 2x రమ్మను ‖