Verse
రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు
Verse
ఎటువంటి శ్రమలందును ఆదరణ నీ కిచ్చునని
గ్రహించి నీవు యేసునిచేరినా
హద్దులేని యింపునొందెదవు
Verse
కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్
కారు మేఘమువలె కష్టములు వచ్చినను
కనికరించి నిన్ను కాపాడును
Verse
సొమ్మసిల్లు వేళలో బలమును నీ కిచ్చును
ఆయన నీ వెలుగు రక్షణ అయినందున
ఆలసింపక నీవు త్వరపడి రమ్ము
Verse
సకల వ్యాధులను స్వస్థపరచుటకు
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో
అందరికి తన కృపల నిచ్చున్