Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rammu Nee Tharunamidhae Pilachuchunna

రమ్ము నీ తరుణమిదే పిలచుచున్నా

Rammu Nee Tharunamidhae Pilachuchunna

Verse
రమ్ము! నీ తరుణమిదే పిలచుచున్నాడు
నీ ప్రభువైన యేసు నొద్దకు
Verse
జీవితమంతయు వ్యర్థముగను దుఃఖముతోను
గడుపుటయేల వచ్చి ఆయన శరణు జొచ్చినచో
వాంఛతో నిన్ను స్వీకరించున్‖ రమ్ము ‖
Verse
కట్టిన యిల్లు ధనధాన్యములు కనబడు బంధుమిత్రులును
గూడు విడిచి నీవు పోయినచో వెంటనీతో రారెవరు‖ రమ్ము ‖
Verse
అందము మాయ అస్థిరమే దాని నమ్మకుము మోసగించును
మరణము ఒకనాడు వచ్చును మరువకు నీ ప్రభువును‖ రమ్ము ‖
Verse
మిన్ను క్రిందన్ భూమి మీదన్ మిత్రుడేసు నామముగాక
రక్షణ పొందు దారిలేదు రక్షకుడేసే మార్గము‖ రమ్ము ‖
Verse
తీరని పాపవ్యాధులను మారని నీదు బలహీనతల్ ఘోర
సిలువలో మోసితీర్చెన్ గాయములచే బాగుపడన్‖ రమ్ము ‖
Verse
సత్యవాక్కును నమ్మి రమ్ము నిత్యజీవమును నీకిచ్చున్
నీ పేరు జీవపుస్తకమునందు నిజముగ ఈనాడే వ్రాయున్‖ రమ్ము ‖

Related Tags

InvitationRepentanceSalvation