Chorus
రమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా మమ్మును గృపాస నమ్ముకడకు నెమ్మి
నడుపుమా మమ్ము నడుపు దీక్షతోఁబ రమ్ము విడిచి యాత్మస్వరూ
పమ్మున నరుదెంచిన దై వమ్ము నీవెకద యెహోవ‖ రమ్ము ‖
Verse
లోకయాత్ర చేయునప్పుడు చీ కాకుపడిన మాకు నీవె మార్గ దర్శివై
వీఁక నొసఁగి మాకరంబుఁ జేకొని పరిశ్రమముఁబాపి సిలువఁ
బడినవానికడకు త్సేకమూని మమ్ముఁజేర్ప‖ రమ్ము ‖
Verse
భక్తవన వసంతదైవమా నీయందుఁ బ్రేమా సక్తివృద్ధిచేసి మనుపుమా
ముక్తిదాత యేసువిభుని రక్తమహిమఁ దెల్పియఘ వి ముక్తులనుగఁజేసి
మమ్ము యుక్తమార్గమందు నిలుప‖ రమ్ము ‖
Verse
జీవితపుబాధ లెన్నియో పెనుఁబ్రోవులగుచు నావరించి మమ్ముఁ దా
కిన మాకు నీవె హితుఁడవగుచు భావమిచ్చి భయముఁదీర్చి జీవ మైన
యేసుపాద సేవకు మముసిద్ధపఱుప‖ రమ్ము ‖
Verse
పలువిధంబులైన చింతలు చెలరేఁగి మమ్ము కలఁతపెట్టు నవసరం
బున వలనుచెడిన మామనముల మలయు వ్యాకులతను మాన్పి వలయు
నాదరణము నిచ్చు పలుకుదోడు వీవెయగుచు‖ రమ్ము ‖
Verse
తొలిప్రవక్త లెంద రెందఱో నీ ప్రేరణమునఁ బలికినట్టి వేదమందునఁ
గల నిగూఢ భావములను దెలుపు నొజ్జవీవెయగుటఁ దెలిపి వాని మమ్ము
జ్ఞాన కలితమతులఁ జేయుకొఱకు‖ రమ్ము ‖
Verse
సడలివాడిపోవుచున్న మా విశ్వాసలతను బలసమృద్ధి నుద్ధరించి మా
యెడఁదశోధనములకతనఁ బొడము సంశయాంకురంబు లడఁచి ప్రేమఁ
జ్యోతిమాలోఁ గడుస్థిరముగ వెలుఁగజేయ‖ రమ్ము ‖
Verse
స్తుతులు నుతులు నీకెచెల్లుఁగా వుత యుగయుగంబు లతులభక్తిని న్నె
కొలుతుము క్షితినివీడ మమ్ము మోక్ష గతికి నడిపి చేర్పుమయ్య మృతికి
మృత్యువైనవాని వితతసింహపీఠిపైని‖ రమ్ము ‖