Chorus
రమ్ము రమ్ము మా యింటికి తండ్రీ రమ్ము రమ్ము
Verse
జగములగన్న ప్రేమ గర్భుడవు జగములకావల నుందువె నీవు సరగ
రమ్ము నీ బిడ్డలగృహమును సందీపనంబు జేయ‖ రమ్ము రమ్ము ‖
Verse
సంతస ప్రేమాశాంతంబుల నిశా(తంబై యీ గృహ మెల్లప్పుడు సంతత
స్వర్గవాసరూపమై సమృద్ధి పొందునటుల‖ రమ్ము రమ్ము ‖
Verse
అనలజ్వాల సపర్యలు వదలి యనిలపక్ష సంచరణమువదలి అనయము
నీ గృహవాసివి నీవై యాశీర్వదించుటుల‖ రమ్ము రమ్ము ‖
Verse
నీ ఘననామోచ్చరణము చేత నీ గృహమెల్లను పావనమై నీ యాగప్రేమ
మర్మంబులు జగతి బాగుగ దెలియునటుల‖ రమ్ము రమ్ము ‖