Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rammu Rammu Parishuddhaathmaa Ramma

రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్మ

Rammu Rammu Parishuddhaathmaa Ramma

Lyricist: Medikayala Sadhuvu
Chorus
రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము రమ్ము రమ్ము దీవింపఁగ నిమ్ము
నీదు కృపను నింపు మా డెందముల్ నెమ్మదిఁ బొందంగ‖ రమ్ము ‖
Verse
జీవంపు టూటవు ప్రేమ జ్వాల వీవె దేవ దాన మీవె యాద
రించువాఁడ‖ రమ్ము ‖
Verse
దేవహస్త మీవె వరము లన్ని నీవె నీవె తండ్రి వాగ్ధ త్తమ్మయి
వెలుగుచుండు‖ రమ్ము ‖
Verse
మాటలాడు శక్తి నిచ్చి నాయాత్మను మేటిల్ల నను నభి షేకించుమీ
దేవ‖ రమ్ము ‖
Verse
ఇమ్ము నీదు వెలుఁగు నింపు నీ ప్రేమతో కమ్ము నాకుఁ తోడు నన్ను
బలపర్చుమా‖ రమ్ము ‖
Verse
పారదోలు దవ్వు నాత్మ శత్రువుల నిం పార నీదు నెమ్మ దిచ్చి ప్రోవు
నన్ను‖ రమ్ము ‖
Verse
ముందు నీవు నడువ నన్ను డాయ దేది యిందు నన్ను ఁ జెరచు
వారు లేరు భువిని‖ రమ్ము ‖
Verse
జనకుఁ జూపు నాకు నట్లె చూపు సుతుని ననయ మెఱిఁగి దేవ నిను
నమ్మి జీవింప‖ రమ్ము ‖
Verse
జనక సుతాత్మయౌ ఘనత్రిత్వమౌ దేవా నిను సన్నుతింపను నీదు
దయ నంపుమా‖ రమ్ము ‖

Related Tags

WorshipPrayerHoly Spirit