Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rammu Shree Yaesoo Sammathi Naadu Mana

రమ్ము శ్రీ యేసూ సమ్మతి నాదు మన

Rammu Shree Yaesoo Sammathi Naadu Mana

Lyricist: Yesudasu Jeevarathnamu
Chorus
రమ్ము శ్రీ యేసూ సమ్మతి నాదు మనమున నిలువ నిమ్ము నా
పెదవుల నీతి అగ్నిచే నంటఁ గ్రమ్మర నా నత్తి వదలి నీ కృపఁ బొంద‖ రమ్ము ‖
Verse
నిన్ను స్తుతింతు నీ కృప నెపుడు నెన్ని కీర్తింతుఁ బన్ను గ నీ కృప ని
న్నెన్నఁ డెరుఁగని నరుల కన్న యేసున్నా నీ ధన్య రుధిరమె చాలు‖ రమ్ము ‖
Verse
తరమె యెన్నఁగను దత్కృపను భూ నభముల నైనన్ నిరతము నీ
ప్రేమ నీతి పరిమితిచే ధరఁ దేజో వాసులకుఁ గలిగించుఁ గడు
వింత‖ రమ్ము ‖
Verse
భవదీయ కృపను బాగుగఁ జాటి భువి నీ చిత్తమును అవిధి నెం చక
తీర్చి యమిత బలముతోడ నవగతి నీతి కి రీటంబు నేఁ బొంద‖ రమ్ము ‖
Verse
నేను నీ కొరకే నిత్యము బ్రతికి నిన్ను గణుతించి మానుగ 'భళా'
యను మంచి వాక్యము విని దీన ప్రభుని సమా ధానములో నేఁ జేర‖ రమ్ము ‖

Related Tags

HolinessDevotionalPrayer