Verse
పల్లవి: రండహో వినరండహో శుభ వార్త ఒకటి వినిపించెదం
సంతోషముతో దరి చేరండి సంభ్రాలతో యిక స్తుతి కలపండి‖ 2x ‖
Verse
అలనాడు బెత్లేహేము పశుల పాకలో
కన్నియ మరియకు శిశువు పుట్టెను‖ 2x ‖
గొల్లలు జ్ఞానులు కానుకలతో స్తుతులర్పించిరి‖ 2x రండహో ‖
Verse
ప్రవచనమునుబట్టి అభిషక్తుడవతరించె
భూరాజులకదిఎంతో భీతి కలిగించెన్‖ 2x ‖
అంతము చేయ దలచినంత దూత గణం రక్షించెన్‖ 2x ‖
సంభ్రాలతో యిక శృతి కలపండి‖ రండహో ‖
Verse
నాటి నుండి నేటి వరకు కృపతో తోడుండి
పరమందు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నా‖ 2x ‖
యేసుని జన్మ శుభాశిస్సులందు కొనరండి‖ 2x ‖
సంభ్రాలతో యిక శృతికలపండి‖ రండహో ‖