Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Randi Maanavulaaraa Rakshakunina Mmand

రండి మానవులారా రక్షకునిన మ్మండ

Randi Maanavulaaraa Rakshakunina Mmand

Lyricist: G John Tathayya
Chorus
రండి మానవులారా రక్షకునిన మ్మండి వేగము ప్రియులారా రండి
పాపుల బ్రోచుటకు పర మండలంబును విడిచి యీ భువి మండలంబున
కరుగుదెంచిన మహాత్మున్ గనుగొని సుఖింపను‖ రండి ‖
Verse
ఇలలో మానవులందరు పలువిధ పాపా శలలో మునిగి యుండిరి
తులువయగు సాతాను చెడ్డ వలను జిక్కినవారలన్ దన బలముతో విడి
పింప బ్రాణము బలిగబెట్టిన ప్రభుని యొద్దకు‖ రండి ‖
Verse
పరముండు నరులందరికై మరణంబయ్యొ కరుణతోడను కొరతపై
మరలి మూడవదినమునందున మహిమతో నా ప్రభువులేచి తెరవజేసెను
మోక్షమార్గము శరణు జొచ్చినవారలకును‖ రండి ‖
Verse
పాపభారంబు నుండి విడుదలనొంద ప్రాపుగోరినవారలు ప్రాప
కుండగు క్రీస్తునాధుని దాపుజేరి తపంబు జేసిన పాపభారము దీసి శాంతిని
గూర్చు యా ప్రభు నొద్దకిపుడే‖ రండి ‖
Verse
భావమందున దెలియుడి మీరలు నిత్య జీవమార్గము గనుడీ పావ
నుండగు క్రీస్తు మిమ్మును పావనులుగా జేసి నూతన జీవము నొసంగి పర
మున జేర్చు మిమ్మును నిశ్చయముగా‖ రండి ‖

Related Tags

InvitationRepentanceSalvation