Verse
రండి పాడ దూతలారా
నిండు సంతోషంబుతో
యేసుని జన్మంబు గూర్చి
ఈ భూలోకమంతట
రండి నేడు పుట్టినట్టి
రాజు నారాధించుడి.
Verse
మందగాయు గొల్లలార!
మనుష్యులతో నేడు
వాసంబు జేయుచున్నాఁడు
వాసిగాను దేవుండు
రండి నేడు పుట్టినట్టి
రాజు నారాధించుడి.
Verse
జ్ఞానులారా! మానుడింక
యోచనలం జేయుట
మానుగాను వెదకుడేసున్
చూచుచు నక్షత్రమున్
రండి నేడు పుట్టినట్టి
రాజు నారాధించుడి.
Verse
పరిశుద్ధులారా! మీరు
నిరీక్షించుచుండిన
యేసు ప్రభువాలయంబు
యేతెంచెను చూడుడి
రండి నేడు పుట్టినట్టి
రాజు నారాధించుడి.
Verse
పశ్చాత్తాప మొందియున్న
పాపులార! మీకు వి
ముక్తి గల్గె; శక్తి నొంది
రక్తి నేసుంజేరుడి
రండి నేడు పుట్టినట్టి
రాజు నారాధించుడి.