Intro
Reference: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను యోహాను John 3:16
Chorus
రండి రండి రయమున యేసుని - రక్షకునిగ నంగీకరించుడి
Pre-Chorus
ప్రీతితో - ప్రభుని చేరుడి ప్రభుల ప్రభువే
రాజుల రాజువే - రాబోవునాతడే
Verse
ప్రయాసపడి భారము మోయువారల - అతి ప్రేమతో నాహ్వానించెను
భారమంత పార ద్రోలును, విశ్రాంతినిచ్చును
వేగమే రారమ్ము ఈ మాట నిక్కము
Verse
పాపపు జీతము నిత్యనరకము, ఓ పాపి నీకిక దిక్కెవరు
నిత్యజీవ మియ్యవచ్చెను, నీ కొరకువచ్చెను
తన ప్రాణమిచ్చెను, నిన్నురక్షింపను
Verse
మాయలోకం మోసముజేసెను - మరణసమయము సమీపించెను
తన్నుచేరువారి నెవ్వరిన్, తృణీకరించడు
నిను త్రోసివేయడు ఈ మాట నమ్ముము
Verse
క్రీస్తుయేసు నిను ప్రేమించి నీ కొరకై తానే వచ్చెన్
నీదు దోషమంతటికై, రక్తము కార్చెను
శిక్షను పొందెను, శ్రీ యేసున్ చేరుము
Verse
పాపులారా పరుగిడిరండి పాపుల మిత్రుడేసుని చేరుడి
శక్తితో నిన్ను రక్షించును సంతోషమిచ్చును
సందేహపడకు, సువార్తన్ నమ్ముము
Verse
నీదు పాపము నంతటిని నీవు నిక్కముగ నొప్పుకొనిన
ఆయనే తనరక్తముతో, కడుగు ప్రేమతో
కాపాడు నేర్పుతో, కరుణ శక్తితో