Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Randi Randi Suvarthabodha Vina Raroju

రండి రండి సువార్తబోధ విన రారోజ

Randi Randi Suvarthabodha Vina Raroju

Chorus
రండి రండి సువార్తబోధ విన రారోజనులారా నిండు మనంబుల
కోర్కెలూరగను నిజరక్షకుఁడగు యేసునిఁ జేర‖ రండి ‖
Verse
పాపము లెడ బాపను యిలకరిగిన ప్రభువు మహిమ వినుఁడి మీ మీ
పాపములను దలపోసి హృదయముల పశ్చాత్తాపపడి యా పరమగురుని
నామముద్వారా ననుసరించి ముంచడముఁ బొందు‖ రండి ‖
Verse
తన మహిమను బలమును దైవత్వము తగ్గించుకొని వడి యప్పుడు
తన సేవకుఁడని మదిఁదలపోయని తగు నీతిని గనుఁడీ క్రీస్తుండును
బాప్తి స్తు డు యోహానునిచే మునుకొని యోర్దాన్నదిలో ముంచుటగని‖ రండి ‖
Verse
మురియుచు క్రీస్తువు యోర్దాన్నదిలో ముంచబడినరీతి నిప్పుడు
గరిమెతో క్రీస్తుని నమ్మిన జనములు గైకొనుటది నీతి మరువక స్థిరముగ
మీ మనముల నెల్ల ప్పుడు నరమరవిడి క్రీస్తుని తగఁజేర‖ రండి ‖
Verse
తల్లులు తమ బిడ్డల కాశీర్వాదము లిమ్మని తేగా నప్పుడు చల్లగ
బాలుర కాశీర్వాద మెసఁగె ప్రభు విదిగాక క్రీస్తుఁడు తొల్లి జనములకు
ముంచడ మిచ్చిన టెల్ల విధులలేదు వేదమున‖ రండి ‖
Verse
అందుచేత వేదమున బాప్తిస్తుండనఁబడె యోహాను ఇప్పుడు పొందుగ
ముంచువారు బాప్తిస్తులు పొసగగ సరిగాను మీరలు నందఱు విన సత్య
వేదవాక్యము సందియములు విడి సాగి వేగమున‖ రండి ‖

Related Tags

InvitationGospelBaptism