Verse
రండి రండి యేసు పిలిచెను ఆత్మరక్షణ్ పొందగను
ప్రేమతోడ నిన్ను చేరెను పరమ శాంతి నీకీయగను
పొందుము తక్షణం రక్షణ భాగ్యము
Verse
ఏది నీజాతి ఏ వంశామైనా ఏ కులము నీదేమతమైనా
ఏకముగా చెడిపోయిన మీరు ఏకముగ ఇల కూడి రండి
Verse
నిన్ను నన్ను రక్షించుటకై యేసు ప్రభువు శిక్షింపబడెను
మరణముల్లును విరిచివేసెను మరలలేచి నిన్ను పిలిచెను
Verse
నీదుపాపము ఒప్పుకొనుము యేసుక్రీస్తుని అంగీకరించుము
తన రుధిరములో నిన్ను కడుగును నీతిమంతునిగా మార్చివేయును