Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Randi Randi Yesuni Yoddaku

రండి రండి యేసుని యొద్దకు

Randi Randi Yesuni Yoddaku

Lyricist: Songs Of Zion
Verse
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
ప్రయాసపడి భారము మోయువారలు
ప్రభుని చెంతకు పరుగిడి వేగమే
Verse
యేసుని పిలుపు వినియు నింక – యోచింపరేల
అవనిలో అగచాట్ల పాలైన
అబ్బదు శాంతి ఆత్మకు నిలలో‖ రండి ‖
Verse
కరువు రణము మరణము చూచి – కలుగదు మారుమనస్సు
ప్రవచనములు సంపూర్ణములాయెను
యూదులు తిరిగి వచ్చుచున్నారు‖ రండి ‖
Verse
ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చె గదా
సిలువను రక్తము చిందించియును
బలియాయెను యా ఘనుడు మనకై‖ రండి ‖
Verse
యేసుని నామమునందె పరమ – నివాసము దొరకును
ముక్తిని పాప విమోచనమును
శక్తిమంతుడు యేసే యిచ్చును‖ రండి ‖
Verse
నేనే మార్గము నేనే సత్యము – నేనే జీవమును
నేను గాకింకెవరు లేరని
యెంచి చెప్పిన యేసుని వద్దకు‖ రండి ‖

Related Tags

InvitationRepentanceSalvation